పాఠశాల మరుగుదొడ్లకు తాళం

ABN , First Publish Date - 2023-03-02T03:16:45+05:30 IST

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పందివానిపల్లెలోని ప్రాథమిక పాఠశాలకు ఏడుకొండలు రూ.2.60లక్షలు అప్పు చేసి మరుగుదొడ్లు నిర్మించారు.

పాఠశాల మరుగుదొడ్లకు తాళం

ఎర్రగొండపాలెం, మార్చి 1: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పందివానిపల్లెలోని ప్రాథమిక పాఠశాలకు ఏడుకొండలు రూ.2.60లక్షలు అప్పు చేసి మరుగుదొడ్లు నిర్మించారు. మూడేళ్లుగా బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎంతకీ బిల్లులు రాకపోవడంతో విసుగుచెందిన ఏడుకొండలు బుధవారం మరుగుదొడ్లకు తాళం వేసి, అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. అప్పులకు వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతున్నానని, ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-03-02T03:16:45+05:30 IST