Share News

జనం ‘నిను నమ్మం జగన్‌’ అంటున్నారు: గంటా

ABN , First Publish Date - 2023-11-10T04:18:26+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ అనే కార్యక్రమం ప్రారంభిస్తే... ప్రజలు ‘వద్దు వద్దు ఈ జగన్‌.. మళ్లీ మాకొద్దు ఈ జగన్‌’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారని

జనం ‘నిను నమ్మం జగన్‌’ అంటున్నారు: గంటా

సీఎం జగన్‌కు 20 ప్రశ్నలతో లేఖ

విశాఖపట్నం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ అనే కార్యక్రమం ప్రారంభిస్తే... ప్రజలు ‘వద్దు వద్దు ఈ జగన్‌.. మళ్లీ మాకొద్దు ఈ జగన్‌’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ‘నిను నమ్మం జగన్‌’...అంటూ ముఖంమీదే చెప్పేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా 20 ప్రశ్నలతో సీఎం జగన్‌కి గంటా లేఖ రాశారు. దాన్ని ఎక్స్‌లో షేర్‌ చేశారు. ఈ రాష్ట్ర ప్రజలకు మీరెందుకు కావాలో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని మీ మూర్ఖపు పాలనతో అధోగతి పాల్జేసి.. అగమ్యగోచరంలోకి నెట్టినందుకా? నవరత్నాలని చెప్పి ఏ ఒక్క రత్నాన్ని సక్రమంగా అమలు చేయనందుకా? అని గంటా ప్రశ్నించారు.

Updated Date - 2023-11-10T04:18:27+05:30 IST