Share News

చలో విజయవాడకు సిద్ధం : సీఐటీయూ

ABN , Publish Date - Dec 14 , 2023 | 10:21 PM

ఆశా వర్కర్ల (అక్రెడిటెడ్‌ సోషల్‌ హెల్త్‌ ఆక్టివిస్టు) సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే చలో విజయవాడకు సిద్ధమవుతామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌ అన్నారు.

 చలో విజయవాడకు సిద్ధం : సీఐటీయూ

ఆశావర్కర్ల 36 గంటల పాటు ధర్నా

నంద్యాల (కల్చరల్‌), డిసెంబరు 14: ఆశా వర్కర్ల (అక్రెడిటెడ్‌ సోషల్‌ హెల్త్‌ ఆక్టివిస్టు) సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే చలో విజయవాడకు సిద్ధమవుతామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌ అన్నారు. నంద్యాల కలెక్టరేట్‌ వద్ద గురువారం ఆశా వర్కర్లు 36 గంటలపాటు ధర్నా నిర్వహించారు. కనీసవేతనాలు చెల్లించాలని, పనిభారాన్ని తగ్గించాలని, గ్రూప్‌ఇన్సూరెన్స్‌ సౌకర్యం, సంక్షమ పథకాలు అమలుచేయాలని, నియామకాల్లో రాజకీయ జోక్యం తొలగించాలని, ప్రభుత్వమే నియామకాలు చేపట్టాలని, పదవీవిరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, రిటైర్మ్‌ంట్‌ బెనిఫిట్స్‌ కల్పించిన తర్వాతే రిటైర్మ్‌ంట్‌ చేయ్యాలని కోరుతూ ఈ ధర్నా నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా మార్పుచేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే తమకు సంబంధంలేని ఆన్‌లైన్‌ పనులన్నీ సొంత ఫోన్‌ద్వారా చేయాలని అధికారులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో జిల్లా 600 మంది ఆశావర్కర్లు, యూనియన్‌ గౌరవఅధ్యక్షుడు ఏసురత్నం, జిల్లా కార్యదర్శి రమణకుమారి, అధ్యక్షురాలు నాగమణి, జిల్లా నాయకులు వెంకటలక్ష్మమ్మ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 10:21 PM