వర్షంలోనూ నల్లకండువాతో నిమ్మల నిరసన
ABN , First Publish Date - 2023-03-19T02:58:32+05:30 IST
ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లకు నాలుగేళ్లుగా తాళాలు ఎందుకు వేశారంటూ టీడీఎల్పీ ఉపనేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శనివారం నల్లకండువాతో ప్లకార్డు పట్టుకుని, అసెంబ్లీ బయట నిరసన తెలిపారు. వర్షం పడుతున్నా..

ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లకు నాలుగేళ్లుగా తాళాలు ఎందుకు వేశారంటూ టీడీఎల్పీ ఉపనేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శనివారం నల్లకండువాతో ప్లకార్డు పట్టుకుని, అసెంబ్లీ బయట నిరసన తెలిపారు. వర్షం పడుతున్నా.. గంటసేపు నిలువుకాళ్లపై నిలబడి నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు రాష్ట్రంలో 8లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టి, 90 శాతం పూర్తిచేసినా.. జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లుగా పనులు పూర్తి చేయకుండా, పేదలకు ఇళ్లు ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారు’’అని మండిపడ్డారు.