విక్రాంత్‌పై ఎల్‌సీఏ తొలి ల్యాండింగ్‌

ABN , First Publish Date - 2023-02-07T02:57:24+05:30 IST

భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పూర్తిస్థాయిలో పనిచేసే దిశగా కీలక ముందడుగు వేసింది.

విక్రాంత్‌పై ఎల్‌సీఏ తొలి ల్యాండింగ్‌

భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పూర్తిస్థాయిలో పనిచేసే దిశగా కీలక ముందడుగు వేసింది. నేవీ అవసరాల కోసం రూపొందించిన ఎల్‌సీఏ (లైట్‌ కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌), మిగ్‌-29కే యుద్ధ విమానాలు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సువిశాలమైన డెక్‌పై తొలిసారి విజయవంతంగా ల్యాండ్‌ అయ్యాయి. ఈ యుద్ధనౌకపై వింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ ల్యాండ్‌ కావడం ఇదే తొలిసారి. నౌకాదళ పైలట్లు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై ఎల్‌సీఏలను ల్యాండ్‌ చేశారని, తద్వారా కీలక మైలురాయిని అధిగమించారని నేవీ పేర్కొంది.

- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి

Updated Date - 2023-02-07T02:57:25+05:30 IST