BJP : అన్నమయ్యపై అలసత్వమా?
ABN , First Publish Date - 2023-05-08T03:22:41+05:30 IST
శ్రీవారి ప్రియ భక్తుడు, వేలాది సంకీర్తనలు రచించి చరిత్రలో నిలిచిపోయిన తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి ఉత్సవాలపై ప్రభుత్వం అలసత్వం
తిరుపతి(కొర్లగుంట), మే 7: శ్రీవారి ప్రియ భక్తుడు, వేలాది సంకీర్తనలు రచించి చరిత్రలో నిలిచిపోయిన తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి ఉత్సవాలపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడం సరికాదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో తాళ్లపాకలో అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జరిగేవని, ఆ తర్వాత ముఖ్యమంత్రులు కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారని చెప్పారు. ఇప్పుడు సీఎం జగన్ దానిని విస్మరించడం బాధాకరమన్నారు. తాళ్లపాకలోని అన్నమయ్య ధ్యాన మందిరంలో పెచ్చులూడుతున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.