పరిశ్రమలకు 50 ఎకరాల్లోపు భూములు
ABN , First Publish Date - 2023-08-19T02:56:57+05:30 IST
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు 50 ఎకరాలలోపు భూ కేటాయింపులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు 50 ఎకరాలలోపు భూ కేటాయింపులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర భూ కేటాయింపుల కమిటీ, జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీల సిఫారసుల మేరకు రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి పారిశ్రామికవేత్తలు పెట్టుకున్న దరఖాస్తులను ఏపీఐఐసీ పరిశీలించింది. రెండు విడతలుగా మొత్తం 195 పరిశ్రమలకు ఆయా జిల్లాల్లో భూములు కేటాయిస్తూ ఏపీఐఐసీ తీసుకున్న నిర్ణయాలను ఆమోదించాలని కోరుతూ చాలాకాలం క్రితమే ప్రభుత్వానికి నివేదించారు. వాటిని ర్యాటిఫై చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.