సీసీఎల్‌ఏ చైర్‌పర్సన్‌గా భూమి సాధికారిక సంస్థ
ABN , Publish Date - Dec 30 , 2023 | 02:43 AM
ఆంధ్రపదేశ్ ల్యాండ్ టైటిల్ (భూమి హక్కు) చట్టం-2023 అమలుపై న్యాయవాద వర్గాలు, రైతు సంఘాల నుంచి తీవ్ర నిరసనలు, అభ్యంతరాలు వెల్లువెత్తుతున్న తరుణంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
ఏర్పాటుచేసిన ప్రభుత్వం
అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రపదేశ్ ల్యాండ్ టైటిల్ (భూమి హక్కు) చట్టం-2023 అమలుపై న్యాయవాద వర్గాలు, రైతు సంఘాల నుంచి తీవ్ర నిరసనలు, అభ్యంతరాలు వెల్లువెత్తుతున్న తరుణంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చట్టాన్ని సమీక్షించాలన్న డిమాండ్‌ను పరిశీలన చేయకుండా, దాని అమలుకే మొండిగా అడుగులు వేసింది. టైటిల్ చట్టం నిర్దేశించినట్లుగా ఆంధ్రప్రదేశ్ భూమి సాధికార సంస్థను (ల్యాండ్ అథారిటీ) ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు (జీవో నం.630) జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయుప్రసాద్ గజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. భూమి అఽథారిటీ చైర్‌పర్సన్‌గా భూపరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) ఉంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై రైతుసంఘాలు, న్యాయవాదులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బార్ అసోసియేషన్లు నిరవధిక రిలేదీక్షలు, ఆందోళనలు చేపడుతున్నాయి. ఇదే సమయంలో సర్కారు ఆ డిమాండ్లపై స్పందించకుండా, చట్టం అమలుకే చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.