మూడు ముక్కలాటను తిరస్కరించారు

ABN , First Publish Date - 2023-03-18T03:40:56+05:30 IST

‘‘అధికార వైసీపీ మూడు ముక్కలాటను 108 నియోజకవర్గాల పరిధిలోని పట్టభద్రులు తిరస్కరించారు.

మూడు ముక్కలాటను తిరస్కరించారు

జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి

గుంటూరు(కార్పొరేషన్‌), మార్చి 17: ‘‘అధికార వైసీపీ మూడు ముక్కలాటను 108 నియోజకవర్గాల పరిధిలోని పట్టభద్రులు తిరస్కరించారు. అధికార దుర్వినియోగం, దొంగ ఓట్ల నమోదు, పోలీసుల అకృత్యాలు, దౌర్జన్యాలన్నింటిని ఎదుర్కొని... ప్రతిపక్ష పార్టీల ఓటు చీలిపోయినప్పటికీ వైసీపీని విద్యావంతులు వ్యతిరేకించారు’’ అని మద్య విమోచన కమిటీ మాజీ చైర్మన్‌, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ‘‘విద్వేషపూరిత, డైవర్షన్‌ రాజకీయాలను వ్యతిరేకించిన పట్టభద్రులు అభివృద్ధికి ఓటు వేశారు. ప్రభుత్వం చేస్తున్న అనుత్పాదక వ్యయాలను వ్యతిరేకించి విజ్ఞతతో తీర్పునిచ్చారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో సైతం ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా పోటీ చేసుంటే గెలిచేవారు’’ అని లక్ష్మణరెడ్డి విశ్లేషించారు.

Updated Date - 2023-03-18T03:41:06+05:30 IST