కర్నూలు జిల్లాలో ఘోరం.. చెరువులో పడి ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2023-05-26T11:38:11+05:30 IST

చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు..

కర్నూలు జిల్లాలో ఘోరం.. చెరువులో పడి ముగ్గురు మృతి
Three people

కర్నూలు: ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు.. బంధుమిత్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. గతంలో చెరువును మరింత లోతుగా తవ్వినట్లు తెలుస్తోంది. దీంతో భారీ గుంతలు ఏర్పడినట్లు సమాచారం. చెరువు లోతు అంచనా వేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మృతులు మరియమ్మ, లోకేష్, సలోమీగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కాగా.. ఒక చిన్నారి ఉన్నారు. ఒకేసారి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు... సంఘటనాస్థలికి చేరుకున్నారు. గ్రామస్థుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. మ‌ృతికి గల కారణాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-05-26T11:41:47+05:30 IST