కర్నూలును రాజధానిగా చేయాలి: కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2023-09-26T04:48:46+05:30 IST

‘‘ఏపీ రాజధానిగా విశాఖ వద్దు. అమరావతే ఉండాలి. లేదంటే కర్నూలునైనా రాజధానిగా చేయాలి’’ అని పీసీసీ మాజీ

కర్నూలును రాజధానిగా చేయాలి: కాంగ్రెస్‌

అనంతపురం, సెప్టెంబరు 25: ‘‘ఏపీ రాజధానిగా విశాఖ వద్దు. అమరావతే ఉండాలి. లేదంటే కర్నూలునైనా రాజధానిగా చేయాలి’’ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. అనంతపురం నగరంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘కర్నూలు రాజధాని రాయలసీమ వాసుల హక్కు. సీఎం జగన్‌రెడ్డి, మంత్రులకు విపక్షాలను ఎలా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప.. ప్రజా, రైతు సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయి. మిగులు భూములను కబ్జా చేయడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారు’’ అని విమర్శించారు.

Updated Date - 2023-09-26T04:48:46+05:30 IST