Share News

కొల్లు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ 15కి వాయిదా

ABN , First Publish Date - 2023-11-10T03:53:15+05:30 IST

మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందుస్తు

కొల్లు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ 15కి వాయిదా

అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై వివరాలను సమర్పించాలని న్యాయస్థానం సీఐడీని ఆదేశించింది. విచారణను నవంబరు 15కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టీ మల్లిఖార్జునరావు గురువారం ఆదేశాలిచ్చారు.

Updated Date - 2023-11-10T03:53:16+05:30 IST