Share News

సచివాలయ సిబ్బంది, వలంటీర్లను దూరంగా ఉంచండి

ABN , Publish Date - Dec 24 , 2023 | 03:15 AM

రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో భారీగా అక్రమాలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసిన టీడీపీ, జనసేన నేతలు ఫిర్యా దు చేశారు. ఎన్నికల ప్రక్రియకు సచివాలయ సిబ్బంది, వలంటీర్లను దూరంగా ఉంచాలని కోరారు. టీడీపీ నేతలు ధూళిపాళ్ల

సచివాలయ సిబ్బంది, వలంటీర్లను దూరంగా ఉంచండి

ఈసీఐ అధికారులను కోరిన టీడీపీ, జనసేన నేతలు

విజయవాడ, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో భారీగా అక్రమాలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసిన టీడీపీ, జనసేన నేతలు ఫిర్యా దు చేశారు. ఎన్నికల ప్రక్రియకు సచివాలయ సిబ్బంది, వలంటీర్లను దూరంగా ఉంచాలని కోరారు. టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, వర్ల రామయ్య, బొండా ఉమ, అశోక్‌బాబు శనివారం విజయవాడలో ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. అనంతరం ధూళిపాళ్ల నరేంద్ర విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాల తయారీలో వైసీపీ నేతలు పాల్పడుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశామని తెలిపారు. పర్చూరు, కాకినాడ, వినుకొండ తదితర నియోజకవర్గాల్లో కేంద్ర బృందం తో ఓటర్ల జాబితా పరిశీలన జరపాలని కోరామన్నారు.

డబుల్‌ ఎంట్రీలపై ఫిర్యాదు చేశాం: మంత్రులు

వైసీపీ నుంచి మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేశ్‌, ఎమ్మెల్యే పేర్ని నాని ఈసీఐ అధికారుల బృందాన్ని కలిశారు. అనంతరం పేర్ని నాని విలేకరులతో మాట్లాడుతూ ఓట్ల నమోదులో అక్రమాలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో ఓట్లు ఉన్నవారికి ఇక్కడ తొలగించామని, అక్కడ ఓటు వినియోగించుకుని తిరిగి ఇక్కడ ఓటునమోదుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 03:15 AM