నేడు జిల్లాలో కేసీఆర్, కేటీఆర్ పర్యటన
ABN , First Publish Date - 2023-11-20T00:30:09+05:30 IST
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ నెల 20వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం ప్రసంగించనున్నారు. నల్లగొండలో మధ్యాహ్నం 3గంటలకు, నకిరేకల్‌లో సాయం త్రం 4గంటలకు జరిగే బహిరంగ సభల్లో ప్రజలనుద్ధేశించి మాట్లాడుతారు.

నకిరేకల్, నల్లగొండలో సీఎం బహిరంగ సభలు
మిర్యాలగూడలో కేటీఆర్ రోడ్‌షో
ఏర్పాట్లు పూర్తి చేసిన అభ్యర్థులు
నల్లగొండ/మిర్యాలగూడ, నవంబరు 19: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ నెల 20వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం ప్రసంగించనున్నారు. నల్లగొండలో మధ్యాహ్నం 3గంటలకు, నకిరేకల్‌లో సాయం త్రం 4గంటలకు జరిగే బహిరంగ సభల్లో ప్రజలనుద్ధేశించి మాట్లాడుతారు. తొలుత నల్లగొండకు రానున్న నేపథ్యంలో నల్లగొండ పరిధిలోని చర్చపల్లి బైపాస్ సమీపంలో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యలు సభల నిర్వహణలో నిమగ్నమయ్యారు. బహిరంగ సభలకు జనాన్ని భారీగా తరలించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు.
మిర్యాలగూడకు కేటీఆర్ : మిర్యాలగూడ పట్టణంలో సోమవారం కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పూర్తి చేశారు. పట్టణంలోని హనుమాన్‌పేట ఫ్లైఓవర్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్‌షో ప్రారంభమై సాగర్‌రోడ్డులో రాజీవ్‌చౌక్ వరకు కొనసాగనుంది. రాజీవ్‌చౌక్‌లో కేటీఆర్ పట్టణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.