కన్నుల పండువగా గోదాదేవి కల్యాణం

ABN , First Publish Date - 2023-01-15T01:21:05+05:30 IST

ధనుర్మాస ఉత్సవాల ముగింపులో భాగంగా మండలంలోని ఉపమాక క్షేత్రంలో శనివారం మధ్యాహ్నం గోదాదేవి, శ్రీరంగనాథుడి కల్యాణోత్సవం కన్నులపండుగా జరిగింది. వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆనుకుని వున్న స్వామివారి పుష్పతోటలో గోదారంగనాథుల పరిణయ మహోత్సవాన్ని ఆలయ ప్రధానార్చకుడు గొట్టుముక్కల ప్రసాద్‌, అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, సాయి గోపాలాచార్యులు, నండూరి రాజగోపాలాచార్యులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

కన్నుల పండువగా గోదాదేవి కల్యాణం
కల్యాణం అనంతరం భక్తులకు దర్శనమిస్తున్న గోదాదేవి, రంగనాథసామి

ఉపమాక క్షేత్రంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన అర్చకులు

పుణ్యకోటి వాహనం మాఢవీధుల్లో ఊరేగింపు

రేపు గిరిప్రదక్షిణోత్సవం

నక్కపల్లి, జనవరి 14: ధనుర్మాస ఉత్సవాల ముగింపులో భాగంగా మండలంలోని ఉపమాక క్షేత్రంలో శనివారం మధ్యాహ్నం గోదాదేవి, శ్రీరంగనాథుడి కల్యాణోత్సవం కన్నులపండుగా జరిగింది. వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆనుకుని వున్న స్వామివారి పుష్పతోటలో గోదారంగనాథుల పరిణయ మహోత్సవాన్ని ఆలయ ప్రధానార్చకుడు గొట్టుముక్కల ప్రసాద్‌, అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, సాయి గోపాలాచార్యులు, నండూరి రాజగోపాలాచార్యులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రతీ ఏటా భోగిపండుగ రోజున గోదాదేవి అమ్మవారి కల్యాణోత్సవం నిర్వహించడం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారు రోజుకో పాశురంతో రంగనాథుడిని కీర్తించి, భోగిపండుగ రోజున స్వామివారిని వివాహమాడినట్టు పురాణాలు చెబుతున్నాయి. ధనుర్మాస వ్రత సమాప్తిలో భాగంగా గోదారంగనాథుల కల్యాణాన్ని పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు విష్వక్సేజన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, భూతబలి, యజ్ఞోపవీతధారణ, మహాసంకల్పం, ప్రవరలు, లగ్నాష్టకాలు, కన్యాదానం, చూర్ణిక వంటి ఘట్టాలను భక్తుల సమక్షంలో నిర్వహించారు. టీటీడీ అధికారులు జీలకర్ర, బెల్లం, పట్టుపీతాంబరాలను అమ్మవారికి సమర్పించారు. అనంతరం గోదారంగనాథులను పుణ్యకోటి వాహనం కొలువుదీర్చి మాఢవీధుల్లో ఊరేగించారు.

రేపు గిరిప్రదక్షిణోత్సవం

ప్రతీ ఏటా కనుమ పండుగ రోజు ఉపమాక వేంకటేశ్వరస్వామి రాజాధిరాజ అలంకరణలో అలంకరణలో భక్తులకు దర్శమిస్తుంటారు. సోమవారం సాయంత్రం గరుడాద్రి పర్వతం చుట్టూ గోవిందనామస్మరణతో గిరిప్రదక్షిణోత్సవం జరుగుతుంది. రాత్రి తొమ్మిది గంటలకు తిరువీధి సేవ నిర్వహిస్తారు.

Updated Date - 2023-01-15T01:21:17+05:30 IST