జగన్ రాజీనామా చేయాలి!
ABN , Publish Date - Dec 18 , 2023 | 02:48 AM
అమరావతి ఉద్యమం మొదలై నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘జై అమరావతి-బిల్డ్ అమరావతి’ నినాదాలతో రాజధాని గ్రామాలు హోరెత్తాయి.
రాజధాని రైతుల డిమాండ్.. నమ్మక ద్రోహానికి నాలుగేళ్లు.. పేరిట గ్రామగ్రామాన నిరసన
తుళ్లూరు(తాడికొండ) డిసెంబరు 17: అమరావతి ఉద్యమం మొదలై నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘జై అమరావతి-బిల్డ్ అమరావతి’ నినాదాలతో రాజధాని గ్రామాలు హోరెత్తాయి. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ‘అమరావతి వెలుగు’ కార్యక్రమం నిర్వహించారు. కొవ్వొత్తులు వెలిగించి గ్రామాలలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘‘మూడు ముక్కలాట ఆడే ముఖ్యమంత్రి దిగిపోవాలి.. అమరావతిని నిర్వీర్యం చేస్తున్న సీఎం మాకు అక్కర్లేదు. అబద్దాల ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. మాట తప్పారు మడమ తప్పారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి. భావితరాల వారి భవిష్యత్ అమరావతి. సైకో ముఖ్యమంత్రి మాకొద్దు. న్యాయస్థానాలే దేవాలయాలు, న్యాయమూర్తులే దేవుళ్లు. పరిపాలన చేతకాని జగన్ వెంటనే రాజీనామా చేయాలి’’ అంటూ రైతులు, రైతు కూలీలు, మహిళలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.