అంగన్‌వాడీలపై కక్షగట్టిన జగన్‌రెడ్డి: ఆచంట
ABN , First Publish Date - 2023-09-26T04:45:23+05:30 IST
అంగన్‌వాడీల జీవితాలను ఉద్ధరిస్తానని ఎన్నికల పచ్రారంలో ఊదరగొట్టిన జగన్‌రెడ్డి అధికారంలోకి రాగానే మాట తప్పి, మడమ తిప్పేశాడని తెలుగునాడు అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీల జీవితాలను ఉద్ధరిస్తానని ఎన్నికల పచ్రారంలో ఊదరగొట్టిన జగన్‌రెడ్డి అధికారంలోకి రాగానే మాట తప్పి, మడమ తిప్పేశాడని తెలుగునాడు అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత విమర్శించారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చమంటూ శాంతియుత ఆందోళనకు సిద్ధమైన అంగన్‌వాడీలపై పోలీసులను ప్రయోగించడం జగన్‌రెడ్డి పెత్తందారీ విధానానికి నిదర్శనమన్నారు. డిమాండ్లను నెరవేర్చకుంటే వారంతా తాడేపల్లి ప్యాలె్‌సను ముట్టడించడం ఖాయమని హెచ్చరించారు.