మద్యం మరణాలకు జగనే బాధ్యుడు: రఘురామ
ABN , First Publish Date - 2023-09-26T04:51:09+05:30 IST
‘నాణ్యత లేని మద్యం తాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మద్యం చావులన్నీ సీఎం జగన్ వాయిస్తున్న మరణ మృదంగమే. మగ వారి సొమ్ములు కొట్టేసి, మహిళలను విధవలను చేస్తున్న

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘నాణ్యత లేని మద్యం తాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మద్యం చావులన్నీ సీఎం జగన్ వాయిస్తున్న మరణ మృదంగమే. మగ వారి సొమ్ములు కొట్టేసి, మహిళలను విధవలను చేస్తున్న దుర్మార్గమైన పాలకులను క్షమిద్దామా?’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. సోమవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు జైల్లో ఉండగానే, పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టులో బెయిల్ లభించడం ఖాయమని చెప్పారు. రాష్ట్రంలో సీఐడీ పోలీసులు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు.