Sankranti Offer: ఏపీ అప్‌డేట్.. మందు బాబులకు సంక్రాంతి ఆఫర్‌!

ABN , First Publish Date - 2023-01-15T21:45:43+05:30 IST

పండగలు, ప్రత్యేక రోజులు వస్తున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తుంది. మద్యం అమ్మ కాలను పెంచడమే లక్ష్యంగా దుకాణాల సమయవేళలను..

Sankranti Offer: ఏపీ అప్‌డేట్.. మందు బాబులకు సంక్రాంతి ఆఫర్‌!

మద్యం దుకాణాల వేళల పెంపు

రేపటి వరకు ఓ గంట పొడిగింపు

పండగలు, ప్రత్యేక రోజులు వస్తున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తుంది. మద్యం అమ్మ కాలను పెంచడమే లక్ష్యంగా దుకాణాల సమయవేళలను పెంచుతోంది. ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 31వ తేదీ రాత్రి, జనవరి 1వ తేదీ రాత్రి 11 గంటల వరకు దుకాణాలు, అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లలో మద్యం విక్రయాలు సాగించవచ్చని ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ రెండు రోజుల్లోనే గత సంవత్సరంతో పోల్చుకుంటే రెం డింతల మద్యం అమ్మకాలు సాగాయి.

పండుగల్లోనూ వేళల పెంపు

సంక్రాంతి పండుగల్లోనూ ఆదాయం పెంచు కునేందుకు మరోసారి మద్యం దుకాణాల సమయవేళలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. సాధా రణంగా ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు దుకాణాల్లో మద్యం విక్రయిస్తారు. అయితే పండుగల సందర్భంగా ఈ నెల 13వ నుంచి 16వ తేదీ వరకు రాత్రి సమయం ఓ గంట పొడిగించారు. ఈ మేరకు ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఉన్నతాధికారులు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా ఈ ఆదేశాల జారీ చేశారు.

Updated Date - 2023-01-15T21:45:45+05:30 IST