జగన్‌ పతనం మొదలైంది

ABN , First Publish Date - 2023-03-26T03:27:28+05:30 IST

‘విద్యార్థి లీడర్‌గా ఎదిగిన చంద్రబాబు ముందు టెన్త్‌ ఫెయిల్‌ అయిన జగన్‌ కుప్పిగంతులు వేశాడు. లాగి ఒకటి కొడితే కిందపడి గిలగిల కొట్టుకుంటున్నాడు. తాడేపల్లి ప్యాలె్‌సకు వణుకు పుట్టింది’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

జగన్‌ పతనం మొదలైంది

దెందులూరు సభలో సౌండేది జగన్‌రెడ్డీ?.. లోకేశ్‌ ప్రశ్న

తాడేపల్లి ప్యాలె్‌సకు వణుకు పుట్టింది

చంద్రబాబు రాజకీయం ముందు నువ్వెంత?

యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌

50వ రోజు యాత్రలో 11.1 కిలోమీటర్ల నడక

పుట్టపర్తి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ‘విద్యార్థి లీడర్‌గా ఎదిగిన చంద్రబాబు ముందు టెన్త్‌ ఫెయిల్‌ అయిన జగన్‌ కుప్పిగంతులు వేశాడు. లాగి ఒకటి కొడితే కిందపడి గిలగిల కొట్టుకుంటున్నాడు. తాడేపల్లి ప్యాలె్‌సకు వణుకు పుట్టింది’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. 50వ రోజు యువగళం పాదయాత్ర శ్రీసత్యసాయి జిల్లాలో కొనసాగింది. ఇప్పటి వరకూ మొత్తం 636.1 కి.మీ. నడిచిన లోకేశ్‌.. శనివారం పుట్టపర్తి నియోజకవర్గంలోని వనుకువారిపల్లి నుంచి రామయ్యపేట విడిది కేంద్రం వరకు 11.1 కి.మీ. పాదయాత్ర సాగించారు. ఈ సందర్భంగా ఓబుళదేవర చెరువు సమీపంలోని బహిరంగ సభలో లోకేశ్‌ ప్రసంగించారు. ‘చంద్రబాబు రాజకీయం ముందు నువ్వెంత జగన్‌.. అమూల్‌ బేబీవి’ అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు జగన్‌కు దిమ్మతిరిగే ఫలితం ఇస్తే... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీవారే ఝలక్‌ ఇచ్చారన్నారు. ఇక జగన్‌ పతనం మొదలైందని స్పష్టం చేశారు. జనం జగన్‌ను నమ్మడం మానేశారన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మడం లేదని, జగన్‌ గురించి అందరికీ అర్థమైందన్నారు. సింహం సింగిల్‌గా వస్తుందని, తన వెంట్రుక కూడా పీకలేరన్న జగన్‌కు జనం గుండు కొట్టించారని, ఇప్పుడు తాడేపల్లి ప్యాలె్‌సలో కూర్చొని టీవీలు పగలగొడుతున్నాడని విమర్శించారు. నాలుగేళ్లగా ప్రజలను, తమ పార్టీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టాడని, తాము ఏదీ దాచుకోబోమని, అట్టుకు అట్టున్నర చెల్లించుకుంటామని హెచ్చరించారు. ఏలూ రు సభలో సౌండేదీ జగన్‌రెడ్డీ అని ఆయన ప్రశ్నించారు.

చార్జీల మోత: ‘‘కరెంటు చార్జీలు ఏడుసార్లు పెంచావు. ఆర్టీసీ చార్జీలు మూడుసార్లు పెంచావు, పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఏపీని దేశంలో నంబర్‌ వన్‌గా చేశావు. ఇంటి పన్ను, చెత్తపన్ను వేశావు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి..’’ అని జగన్‌ పాలనను లోకేశ్‌ ఎండగట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి, నోటిఫికేషన్‌ ఇస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. పాదయాత్రలో వనుకువారిపల్లి నుంచి రామయ్యపేట వరకు జనం బారులు తీరి లోకేశ్‌కు స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. పాదయాత్రలో సినీనటుడు నారా రోహిత్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, భారీ వాహనాల డ్రైవర్లు, క్లీనర్ల సంఘం ప్రతినిధులు, గాజుల కుంట వద్ద రైతులు లోకేశ్‌ను కలిసి సమస్యలను విన్నవించారు.

Updated Date - 2023-03-26T03:27:28+05:30 IST