మైకులో మాట్లాడితే పెద్ద నాయకుడా?!

ABN , First Publish Date - 2023-04-03T02:15:39+05:30 IST

మైకులో నాలుగు మాటలు మాట్లాడితే, పది మంది పోలీసులను వెంటేసుకుని తిరిగితే పెద్ద నాయకుడేం కాదని మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌, వైసీపీ నేత చిట్టా విజయభాస్కర్‌రెడ్డి విమర్శించారు.

మైకులో మాట్లాడితే పెద్ద నాయకుడా?!

మంత్రి అంబటిని ఉద్దేశించి వైసీపీ నేత విమర్శ

సత్తెనపల్లి, ఏప్రిల్‌ 2: మైకులో నాలుగు మాటలు మాట్లాడితే, పది మంది పోలీసులను వెంటేసుకుని తిరిగితే పెద్ద నాయకుడేం కాదని మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌, వైసీపీ నేత చిట్టా విజయభాస్కర్‌రెడ్డి విమర్శించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన ఆదివారం తన నివాస గృహం వద్ద వైఎ్‌సఆర్‌ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సత్తెనపల్లి అనాఽథ బిడ్డ కాదని, ఎవరెవరో వచ్చి సంపాదించుకు వెళ్తున్నారని మంత్రిని ఉద్దేశించి విమర్శించారు. బయట వ్యక్తుల పెత్తనాన్ని నియోజక వర్గంలో సహించేది లేదన్నారు. దీనివల్ల నేడు నియోజకవర్గంలో పార్టీ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. 2024 ఎన్నికల్లో తాను అసెంబ్లీ టికెట్‌ కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తానన్నారు. సమావేశంలో పలువురు పార్టీ సీనియర్‌ నేతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T02:15:39+05:30 IST