బీసీ హాస్టళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2023-06-06T04:18:21+05:30 IST
2023–24 సంవత్సరానికి బీసీ ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఆశన్న
హైదరాబాద్ సిటీ, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): 2023–24 సంవత్సరానికి బీసీ ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఆశన్న తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో పది ప్రీ మెట్రిక్, నలభై పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలున్నాయని చెప్పారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ ఏడాదికి సంబంధించిన బోనఫైడ్, గతేడాది మార్కుల మెమో, ఆధార్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో https://bchostels.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన వెల్లడించారు. మరిన్ని వివరాలకు 040–27428478 ఫోన్ నంబరును సంప్రదించాలని సూచించారు.