Share News

తక్షణమే ఆర్టీఐ పోర్టల్‌!

ABN , First Publish Date - 2023-11-30T03:42:56+05:30 IST

సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద పౌరులు సమాచారం పొందేందుకు వీలుగా తక్షణమే వెబ్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు

తక్షణమే ఆర్టీఐ పోర్టల్‌!

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద పౌరులు సమాచారం పొందేందుకు వీలుగా తక్షణమే వెబ్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి పోర్టల్‌ ఎందుకు ఏర్పాటు చేయలేదో వివరణ ఇవ్వాలని పేర్కొంది. వెబ్‌ పోర్టల్‌ ఏర్పాటుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌ రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. పౌరులు సమాచారం పొందేందుకు వీలుగా ఆర్టీఐ వెబ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఏపీలో పోర్టల్‌ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ హైకోర్టు న్యాయవాది వీవీఎ్‌సఎస్‌ శ్రీకాంత్‌ పిల్‌ దాఖలు చేశారు. బుధవారం ఈ పిల్‌ విచారణకు రాగా ప్రతివాదులకు కోర్టు నోటీసులిచ్చింది.

Updated Date - 2023-11-30T03:42:57+05:30 IST