జైళ్ల సిబ్బంది బదిలీల్లో వసూళ్లపై ఆరా

ABN , First Publish Date - 2023-06-02T04:43:02+05:30 IST

ఏపీ జైళ్ల శాఖ సిబ్బంది బదిలీల్లో భారీగా ముడుపులు చేతులు మారడంపై ప్రభుత్వ నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. బదిలీలు జరిగిన విధానం మొదలుకుని ఐదేళ్లు

జైళ్ల సిబ్బంది బదిలీల్లో వసూళ్లపై ఆరా

ఏపీ జైళ్ల శాఖ సిబ్బంది బదిలీల్లో భారీగా ముడుపులు చేతులు మారడంపై ప్రభుత్వ నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. బదిలీలు జరిగిన విధానం మొదలుకుని ఐదేళ్లు దాటిన వారందరూ బదిలీ అయ్యారా? దాటని వారిలో ఎందరు బదిలీ అయ్యారు? సుదీర్ఘ కాలం పాటు ఒకేచోట ఉన్నవారికి అటాచ్‌మెంట్‌ ఇచ్చారా? జైళ్లలో ఖాళీలకు అనుగుణంగా సమతుల్యత పాటించారా? వసూలు చేసిందెవరు? వాటాలు పంచుకున్నది ఎవరెవరు? అనే విషయాలపై ఆరా తీశాయి. డబ్బులిచ్చినా పోస్టింగ్‌ దక్కని పలువురు సిబ్బంది మొత్తం వ్యవహారంపై పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలిసింది.

Updated Date - 2023-06-02T04:43:12+05:30 IST