Share News

26 నుంచి మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మె

ABN , Publish Date - Dec 24 , 2023 | 12:03 AM

మున్సిపల్‌ కాంట్రాక్టు ఇంజనీరింగ్‌ కార్మికులు ఈనెల 26వ తేదీ నుంచి నిరవధిక సమ్మెను చేపట్టనున్నారు.

26 నుంచి మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మె

కమిషనర్‌కు నోటీసు అందజేత

నంద్యాల టౌన్‌, డిసెంబరు 23 : మున్సిపల్‌ కాంట్రాక్టు ఇంజనీరింగ్‌ కార్మికులు ఈనెల 26వ తేదీ నుంచి నిరవధిక సమ్మెను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి శనివారం సమ్మె నోటీసును మున్సిపల్‌ కమిషనర్‌ రవిచంద్రారెడ్డికి సీఐటీయూ, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నంద్యాల శాఖల నాయకులు అందజేశారు. సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌, కార్యదర్శి మహమ్మద్‌ గౌస్‌, ఫెడరేషన్‌ స్థానిక శాఖ కార్యదర్శి భాస్కరాచారి, తదితరులు కమిషనర్‌ను కలిశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆప్కా సిబ్బందికి పదవీ విరమణ ప్రయోజనాలు, గ్రాట్యూటీ, పెన్షన్‌, ఇంజనీరింగ్‌ సిబ్బందికి రిస్క్‌ అలవెన్స్‌, హెల్త్‌ అలవెన్స్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో పెడచెవినబెట్టి కార్మికులకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. నాయకులు వెంకటలింగం, రామకృష్ణ, రామాంజనేయులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

నందికొట్కూరు రూరల్‌ : మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ కిశోర్‌కు సమ్మె నోటీసు తో వినతి పత్రం అందజేశారు. సీఐటీయు నాయకులు , మున్సిపల్‌ వర్కర్ల నాయకులు పరమేష్‌, భాస్కర్‌, సర్వర్‌ ఖాన్‌, నాగేశ్వరారవు మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులంతా నిరవదిక సమ్మెలోకి వెలుతున్నట్లు వారు తెలిపారు.సుప్రిం కోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. అలా కాక రాష్ట్ర ప్రభుత్వం చాలీ చాలని వేతనాలతో మున్సిపల్‌ కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తుందన్నారు .కార్మికులకు రిటైర్‌ మెంట్‌ బెనిఫిట్‌ ్స, పెన్షన్లు,హెల్త్‌ అలవెన్స్‌,అమలు చేయాలన్నారు.మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిస్కరించక పోతే సమ్మె లోకి వెలతామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్ష్య కార్యదర్శులతో పాటు నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 12:03 AM