పెన్షనర్లకు కొత్త పద్ధతి ప్రకారమే ఆదాయ పన్ను గణన
ABN , First Publish Date - 2023-07-23T02:20:07+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు డీఫాల్ట్‌గా కొత్త పద్ధతి ప్రకారమే ఆదాయపు పన్ను గణన చేయాలని ట్రెజరీలకు, సీఎ్‌ఫఎంఎ్‌సకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ ఎకౌంట్స్ నుంచి ఆదేశాలు వెళ్లాయి.
అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు డీఫాల్ట్‌గా కొత్త పద్ధతి ప్రకారమే ఆదాయపు పన్ను గణన చేయాలని ట్రెజరీలకు, సీఎ్‌ఫఎంఎ్‌సకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ ఎకౌంట్స్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. దానికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాలని సీఎ్‌ఫఎంఎ్‌సను ఆదేశించారు. జూలై నెల పెన్షన్ నుంచి నెలవారీగా ఆదాయపు పన్ను మినహాయింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే కొత్త పద్ధతి ప్రకారం కాకుండా పాత పద్ధతిలో ఆదాయ పన్ను గణన కావాలనుకునే పెన్షనర్లు సీఎ్‌ఫఎంస్ సైట్‌లో గానీ, ఖజానా కార్యాలయాల్లో గానీ తప్పనిసరిగా ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.