బాబుపై కేసు ఎత్తేయకుంటే ప్రజా ఉద్యమం

ABN , First Publish Date - 2023-09-18T02:44:14+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయకపోతే ప్రజాఉద్యమం తప్పదని అఖిలపక్షం నేతలు హెచ్చరించారు.

బాబుపై కేసు ఎత్తేయకుంటే   ప్రజా ఉద్యమం

అఖిలపక్ష నేతలు

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 17: టీడీపీ అధినేత చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయకపోతే ప్రజాఉద్యమం తప్పదని అఖిలపక్షం నేతలు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం హోటల్‌ జగదీశ్వరీలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక నేరస్థుడైన జగన్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉండద న్నారు. ఎవరు గజదొంగో ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, కాంగ్రెస్‌ పార్టీ రూరల్‌ ఇన్‌చార్జి బాలేపల్లి మురళీధర్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, జనసేన రాజమహేంద్రవరం నియోజకవర్గ ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ, వై.శ్రీనివాస్‌, సీపీఎం నగర నాయకులు బి.పవన్‌, ఎమ్మార్పీఎస్‌ నేత వైరాల అప్పారావు ఇతర ప్రజా సంఘాలు నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-18T02:44:14+05:30 IST