‘ఇండియా’ వస్తే రెండేళ్లలో పోలవరం

ABN , First Publish Date - 2023-10-07T03:19:27+05:30 IST

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యమని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ధీమా వ్యక్త చేశారు.

‘ఇండియా’ వస్తే రెండేళ్లలో పోలవరం

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయాన్ని అడ్డుకోలేరు: రఘువీరా

మడకశిర, అక్టోబరు 6: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యమని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ధీమా వ్యక్త చేశారు. ప్రధాని మోదీ ఎన్నిసార్లు తెలంగాణలో తిరిగినా, సీఎం కేసీఆర్‌ ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్‌ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. ఐదు గ్యారెంటీ పథకాలు కాంగ్రె్‌సను గెలిపిస్తాయన్న నమ్మకం ఉందని చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 2014 వరకు పోలవరం ప్రాజెక్టు పనులను 80శాతం పూర్తి చేశామమన్నారు. ఆ తర్వాత బీజేపీ, టీడీపీ, జగన్‌ ప్రభుత్వాలు ఇప్పటివరకు ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు. వచ్చే 6నెలల్లో పోలవరం ప్రాజెక్టును కేంద్రం పూర్తిచేయాలని, లేకుంటే కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఇండియా కూటమి ప్రభుత్వం రెండేళ్లలో పనులు పూర్తి చేస్తుందన్నారు.

Updated Date - 2023-10-07T03:19:27+05:30 IST