YSRCP MLA: నేను మీ ఎమ్మెల్యేను!
ABN , First Publish Date - 2023-08-13T03:08:27+05:30 IST
‘అమ్మా..నేనెవరో తెలుసా?.. తెలియదు సారూ.. నేను మీ ఎమ్మెల్యేను’ ఇవీ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాట్లు. ఎల్.కోట
‘గడప గడప’లో వైసీపీ ఎమ్మెల్యే పాట్లు
నేనెవరో తెలుసా అంటే.. తెలియదన్న మహిళలు
‘అమ్మా..నేనెవరో తెలుసా?.. తెలియదు సారూ.. నేను మీ ఎమ్మెల్యేను’ ఇవీ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాట్లు. ఎల్.కోట మండలం కల్లేపల్లి గ్రామానికి అప్పుడెప్పుడో 2019 ఎన్నికల సమయంలో వచ్చిన ఆయన ఎన్నికల్లో గెలిచాక ఆ గ్రామం వైపు రాలేదు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా శనివారం కల్లేపల్లికి వచ్చారు. అయితే చాలామంది ఆయన్ను గుర్తుపట్టలేదు. శ్రీనివాసరావు ‘నేను మీ ఎమ్మెల్యేను’ అంటూ పరిచయం చేసుకున్నారు. - లక్కవరపుకోట