వెనక్కు తగ్గేదేలా..
ABN , Publish Date - Dec 29 , 2023 | 11:35 PM
ప్రభుత్వం దిగి వచ్చి న్యాయ సమ్మతమైన తమ సమస్యలు పరిష్కరించేంత వరకు వెనక్కు తగ్గేదేలా అని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహా యకులు స్ఫష్టం చేశారు. గత 18 రోజులుగా సమ్మెలో ఉంటూ.. తాము అనేక రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమ న్నారు.
సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదు
అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు
బి.కొత్తకోటలో గోమాతకు వినతిపత్రం
వాల్మీకిపురంలో ఒంటికాళ్లపై నిలబడి..
రాయచోటిలో చెవిలో పూలు పెట్టుకొని నిరసన
రాజంపేటలో మున్సిపల్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
(రాయచోటి-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం దిగి వచ్చి న్యాయ సమ్మతమైన తమ సమస్యలు పరిష్కరించేంత వరకు వెనక్కు తగ్గేదేలా అని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహా యకులు స్ఫష్టం చేశారు. గత 18 రోజులుగా సమ్మెలో ఉంటూ.. తాము అనేక రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమ న్నారు. తమ సమస్యల పట్ల బాధ్యతగా ఉండాల్సిన మంత్రులు సైతం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వాపోయా రు. అంగన్‌వాడీ కార్యకర్తలను రాష్ట్ర ప్రభుత్వం దోషులుగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. సచివాలయ సిబ్బందితో అంగన్‌వాడీ సెంటర్లను నిర్వహించి.. తమ ఉద్యమాన్ని దెబ్బతీయాలని ప్రభుత్వం కుటిలయత్నం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కంటే రూ.వెయ్యి అదనంగా వేతనాలు ఇస్తానని ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర సందర్భంగా జగన్ మాట ఇచ్చారన్నారు. అయితే ఇప్పుడు దాన్ని చెత్తబుట్టలో వేశాడని ఆరోపిం చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటం ఆపేది లేదని ప్రకటించారు. అదే విధంగా మున్సిపల్ కార్మికులు, సమగ్ర శిక్షా పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం తమ సమ్మెను కొనసాగిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
- రాయచోటి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ వర్కరు సీఐటీయూ ఆఽధ్వర్యంలో శుక్రవారం రాయచోటి ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డి.భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ రిలేదీక్షలకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులకొండారెడ్డి హాజరై మద్దతు ప్రకటించి మాట్లాడారు.
- రైల్వేకోడూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు రిలేదీక్షలు ప్రారంభించారు. సమ్మె మొదలైనప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ కార్మికులు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. రైల్వేకోడూరు ప్రాజెక్టు లీడర్ రమాదేవి ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు.
- వాల్మీకిపురం ప్రాజెక్టు పరిధిలో గత 18 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె కొనసాగిస్తున్నా రు. శుక్రవారం స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. అనంతరం ఒంటికాళ్లపై నిలబడి నమస్కరిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
- తంబళ్లపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తంబళ్ల పల్లె, కురబలకోట, పెద్దమండెం మండలాల అంగన్వాడీ లు చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరింది. శుక్రవారం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద రిలేదీక్షలు చేపట్టారు.
- రాజంపేట ప్రాజెక్టు పరిధిలో సీఐటీయూ ఆధ్వర్యం లో అంగన్‌వాడీ వర్కర్లు శుక్రవారం రిలేదీక్షలు మొదలు పెట్టారు. 18వ రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. మంత్రులు మాట్లాడే తీరు ఏమాత్రం సరిగా లేదన్నారు. ఇటువంటి వాళ్లను మంత్రులుగా ఎన్నుకోవడం మన దురదృష్టమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్వేలి రవికుమార్, అంగన్‌వాడీ ప్రాజెక్టు నాయకురాలు విజయ, అమరావతి, శివరంజని, హేమలత తదితరులు పాల్గొన్నారు.
- సుండుపల్లె మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వ ర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. హామీలు నెరవేర్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదన్నారు.
- లక్కిరెడ్డిపల్లె మండలంలో స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట రిలేదీక్షలు చేపట్టారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారమయ్యే వరకు దీక్షలు కొనసాగు తాయని అంగన్‌వాడీ వర్కర్ల ప్రాజెక్టు అధ్యక్షురాలు సుకుమారి అన్నారు.
కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె
రాజంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట నాల్గవరోజు మున్సిపల్ ఆఫీసర్ దగ్గర అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వినూ త్న నిరసన చేశారు. ప్రభుత్వం చెప్పిన మాటకు కట్టుబ డి మున్సిపల్ కార్మికులు జీతాలు ఇవ్వాలని, అందరినీ రెగ్యులర్ చేయాలని, చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్వేల్ రవికుమార్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ ఓబయ్య, జిల్లా నాయకురాలు లక్ష్మిదేవి, రాజంపేట మున్సిపల్ నాయకులు, ప్రసాద్, రమణ, పెంచలమ్మ తదితరులు పాల్గొన్నారు.
- రాయచోటి మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీ యూ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు రాంబాబు, చెన్నయ్య, అగ్గిరాముడు తదితర కా ర్మిక నేతలు, కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
- మదనపల్లె మున్సిపల్ కార్యాయలం ఎదుట పారిశుధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. పారిశుధ్య కార్మికులు జనవరి 6 నుంచి సమ్మెలోకి వస్తారని నాయకులు సురేష్‌కుమార్ తెలిపారు.
సమ్మెలోనే.. సర్వశిక్ష ఉద్యోగులు
సమగ్ర సర్వశిక్ష ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె 10వ రోజుకు చేరుకుంది. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలుపుతున్నారు.