Minister Usha Sri: మంత్రి ఉషశ్రీ ఇంటి వద్ద హై టెన్షన్
ABN , Publish Date - Dec 30 , 2023 | 01:31 PM
కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి ఉషశ్రీ ఇంటిని అంగన్‌వాడీ కార్యకర్తలు ముట్టడించారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అంగన్‌వాడీలు తరలివచ్చారు.
అనంతపురం: కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి ఉషశ్రీ ఇంటిని అంగన్‌వాడీ కార్యకర్తలు ముట్టడించారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అంగన్‌వాడీలు తరలివచ్చారు. మంత్రి ఇంటి వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. మంత్రి ఉషశ్రీ చరణ్ బయటికి రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సొంత శాఖలో అంగన్‌వాడీలు ఆందోళన చేస్తుంటే మంత్రి స్పందించడం లేదంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.