ప్రవీణ్‌ ప్రకాశ్‌ హాజరుకు హైకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2023-06-29T04:44:47+05:30 IST

కోర్టు ధిక్కరణ కేసులో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌కు హైకోర్టు షాక్‌ఇచ్చింది. ప్రవీణ్‌ ప్రకాశ్‌తోపాటు కమిషనర్‌ న్యాయస్థానానికి హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది.

ప్రవీణ్‌ ప్రకాశ్‌ హాజరుకు హైకోర్టు ఆదేశం

ఎయిడెడ్‌ పాఠశాలల్లో పోస్టుల భర్తీపై ధిక్కరణ కేసు

పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ హాజరుకావాలన్న న్యాయస్థానం

అమరావతి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కరణ కేసులో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌కు హైకోర్టు షాక్‌ఇచ్చింది. ప్రవీణ్‌ ప్రకాశ్‌తోపాటు కమిషనర్‌ న్యాయస్థానానికి హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసుకొనేందుకు అనుమతించాలని 2013లో తామిచ్చిన ఆదేశాలు అమలుకాకపోవడంపై వివరణ ఇచ్చేందుకు న్యాయస్థానం ముందు హాజరుకావాలని ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈమేరకు జస్టిస్‌ ఆర్‌.రఘునందన రావు బుధవారం ఆదేశాలిచ్చారు. తమ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఎయిడెడ్‌ పోస్టులు భర్తీ చేసుకొనేందుకు అనుమతించాలని కోరుతూ పలు ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయస్థానం పోస్టులభర్తీకి అనుమతివ్వాలని 2013 ఆగస్టు 20న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు అమలుకాకపోవడంతో యాజమాన్యాలు కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు దాఖలుచేశాయి. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా ప్రవీణ్‌ప్రకాశ్‌, కమిషనర్ల హాజరుకు హైకోర్టు ఆదేశించింది.

.

Updated Date - 2023-06-29T06:00:14+05:30 IST