అప్పన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
ABN , First Publish Date - 2023-03-19T02:41:02+05:30 IST
సింహా చలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం రాత్రి రాష్ట్ర హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు.

సింహాచలం, మార్చి 18: సింహా చలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం రాత్రి రాష్ట్ర హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో జస్టిస్ రఘునందనరావు, జస్టిస్ బి.వరాహలక్ష్మీనృసింహ చక్రవర్తి, జస్టిస్ డి.రమేష్, జస్టిస్ రాజశేఖర్, జస్టిస్ శ్రీనివాసరెడ్ది ఉన్నారు. వారికి దేవస్థానం ఏఈఓ వీబీ రమణమూర్తి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. న్యాయమూర్తుల గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలు చేశారు.