సత్వర న్యాయమే సామాజిక న్యాయం
ABN , First Publish Date - 2023-04-15T03:01:33+05:30 IST
కక్షిదారులకు సత్వర న్యాయం అందించటం ద్వారా సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, ఇందుకు న్యాయమూర్తులు ఎప్పుడూ సంసిద్ధులై ఉంటారని తదునుగుణంగా న్యాయవాదులు కూడా సహకారం అందించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు పేర్కొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు
గుంటూరు(లీగల్), ఏప్రిల్ 14: కక్షిదారులకు సత్వర న్యాయం అందించటం ద్వారా సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, ఇందుకు న్యాయమూర్తులు ఎప్పుడూ సంసిద్ధులై ఉంటారని తదునుగుణంగా న్యాయవాదులు కూడా సహకారం అందించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 132వ జయంతి కార్యక్రమం గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమస్యలపై కోర్టుకు వచ్చిన కక్షిదారులు వాయిదాల పద్దతి నేపథ్యంలో ఎంతో నష్టపోతున్నారని తెలిపారు. త్వరితగతిన న్యాయం జరగకపోవటం కూడా అన్యాయమేనని స్పష్టంచేశారు.