Share News

చిరుధాన్యాలతో ఆరోగ్యం పదిలం

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:21 AM

చిరుధాన్యాలతో ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చనని ఏడీఆర్‌ డాక్టర్‌ ఎన్‌సీ వెంకటేశ్వర్లు అన్నారు.

చిరుధాన్యాలతో ఆరోగ్యం పదిలం

నంద్యాలలో వాకథాన్‌ నిర్వహించిన ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు

నంద్యాల టౌన్‌, డిసెంబరు 30 : చిరుధాన్యాలతో ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చనని ఏడీఆర్‌ డాక్టర్‌ ఎన్‌సీ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజల్లో చిరుధాన్యాల ఆహార పదార్థాలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో శనివారం వాకథాన్‌ నిర్వహించారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ సెంటినరీ హాల్‌ నుంచి శ్రీనివాససెంటర్‌ వరకు వాకథాన్‌ సాగింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం - 2023 ముగింపు సందర్భంగా ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సావాలలో భాగంగా నాలుగు కిలోమీటర్ల వాకథాన్‌ను ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా జెండా ఊపి ప్రారంభించారు. శ్రీనివాససెంటర్‌లో మానవహారంగా ఏర్పడి చిరుధాన్యాలపై అవగాహన సందేశాన్ని, ప్రతిజ్ఞను చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిరుధాన్యాల వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. సాగు విస్తీర్ణం, దిగుబడి పెంపుకు రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో పంటలను సాగు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావుతదతరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:21 AM