పలాస జన సమీకరణ ఇన్‌చార్జీగా హరిబాబు
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:41 PM
నంద్యాలకు చెందిన ప్రముఖ టీడీపీ నాయకుడు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటుపల్లె హరిబాబును శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ నియోజకవర్గ యువగళం పాదయాత్ర జన సమీకరణ ఇన్‌చార్జీగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియమించారు.
నంద్యాల టౌన్, డిసెంబరు 17 : నంద్యాలకు చెందిన ప్రముఖ టీడీపీ నాయకుడు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటుపల్లె హరిబాబును శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ నియోజకవర్గ యువగళం పాదయాత్ర జన సమీకరణ ఇన్‌చార్జీగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియమించారు. ఈ నెల 20న టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు భారీ బహిరంగ సభకు జన సమీకరణ కోసం పలాసా ఇన్‌చార్జీగా హరిబాబును నియమించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పలాస నుంచి పాదయాత్ర ముగింపు సభకు భారీ జన సమీకరణ చేయనుననట్లు హరిబాబు తెలిపారు. పలాస ఇన్‌చార్జీగా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిర్వహించిన జన సమీకరణ సమీక్షలో పలాస ఇన్‌చార్జీగా పాల్గొని జన సమీకరణ కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు హరిబాబు తెలిపారు.