భూములు అప్పగించండి
ABN , First Publish Date - 2023-11-21T00:10:44+05:30 IST
‘మేం సాగు చేసుకుంటున్న భూములకు మూడు దశాబ్దాల క్రితం పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు కాదంటున్నారు. గిరిజనులకు అండగా నిలవాల్సిన కమ్యూనిస్టు నేతలు అడ్డు పడుతున్నారు. పట్టాలిచ్చిన మేరకు భూములు అప్ప గించాల’ని జి.టి.పేట పంచాయతీ పనుకువానివలస గిరిజన రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే... 30 ఏళ్ల క్రితం జి.టి.పేట రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 186లో పనుకువానివలస గిరిజనులకు, గుర్ల గ్రామ ఎస్టీలకు మొత్తం 15 మందికి 171 తదితర సర్వే నెంబర్లలో డీ పట్టాలు మంజూరు చేశారు. ఒక్కొక్కరికీ మూడు, నాలుగు ఎకరాల వరకు పట్టాలిచ్చారు. వాటితో పాటు మరికొందరు ఎస్టీలు, బీసీలు కూడా కొంత డీపట్టా భూమిని ఆక్రమించుకొని సాగు చేస్తున్నారు.

మెంటాడ: ‘మేం సాగు చేసుకుంటున్న భూములకు మూడు దశాబ్దాల క్రితం పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు కాదంటున్నారు. గిరిజనులకు అండగా నిలవాల్సిన కమ్యూనిస్టు నేతలు అడ్డు పడుతున్నారు. పట్టాలిచ్చిన మేరకు భూములు అప్ప గించాల’ని జి.టి.పేట పంచాయతీ పనుకువానివలస గిరిజన రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే... 30 ఏళ్ల క్రితం జి.టి.పేట రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 186లో పనుకువానివలస గిరిజనులకు, గుర్ల గ్రామ ఎస్టీలకు మొత్తం 15 మందికి 171 తదితర సర్వే నెంబర్లలో డీ పట్టాలు మంజూరు చేశారు. ఒక్కొక్కరికీ మూడు, నాలుగు ఎకరాల వరకు పట్టాలిచ్చారు. వాటితో పాటు మరికొందరు ఎస్టీలు, బీసీలు కూడా కొంత డీపట్టా భూమిని ఆక్రమించుకొని సాగు చేస్తున్నారు.
సమస్య ఎలా మొదలైందంటే...
కొందరు రైతులు బతుకు తెరువు కోసం వలస వెళ్లారు. స్వగ్రామానికి అప్పు డప్పుడు వస్తుంటారు. ఈక్రమంలో ఒకరి భూమిలోకి ఇంకొకరు చొచ్చుకుపోయారు. ఇన్నాళ్లూ అందరూ సర్దుకుపోయారు. కొద్ది రోజుల క్రితం పనుకువానివలస రైతులు పాక వేశారు. ఆ స్థలం తమదని గుర్లకు చెందిన ఎస్టీ రైతులు వాదిస్తు న్నారు. తమ పాకకు నిప్పంటించారని పనుకువానివలస రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు దీనిపై విచారణ చేపట్టి.. ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఇలా ఉండగా.. సోమవారం పనుకువాని వలస రైతులు ఆందోళనకు దిగారు. తమకు అండగా నిలవాల్సిన కమ్యూనిస్టు నేతలు ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని...ఆ నేతలతో పాటు వారి కుటుంబ సభ్యులు భూ కబ్జాలో భాగస్వాములయ్యారని ఆరోపించారు. ప్ల కార్డులతో నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్ రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. తహశీల్దార్ రామకృష్ణ మాట్లాడుతూ రెండు గ్రామాలకు చెందిన రైతులను సమావేశపరిచి బహిరంగ విచారణ చేపడతామని అన్నారు. ముందుగా కార్యాలయంలో ఉన్న రికార్డులు పరిశీలిస్తామన్నారు. సాగు చేసిన రైతు పేరున పట్టాలేకపోయినా.. పట్టా ఉండి... అదే సర్వే నెంబర్‌లో సాగు చేయకపోయినా భూమి అప్పగించడం కుదరదని అన్నారు. కొద్ది రోజుల్లో బహిరంగ విచారణ జరిపి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ భూములపై ఇరు వర్గాల రైతులు కోర్టును ఆశ్రయించారని తెలిపారు. తమ పరిధి మేరకు ముందుకు వెళతామని తహశీల్దార్ చెప్పారు.