‘భవిష్యత్‌కు గ్యారంటీ’ని అడ్డుకున్న ఎస్‌ఐ
ABN , First Publish Date - 2023-12-11T02:43:20+05:30 IST
అసమర్థ పాలనతో, అవినీతి, అరాచకాలతో అస్తవ్యస్తంగా మారిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రమే బాగు
ముప్పాళ్ళ, డిసెంబరు 10: అసమర్థ పాలనతో, అవినీతి, అరాచకాలతో అస్తవ్యస్తంగా మారిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రమే బాగు చేయగలరని ఆ పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెంలో బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ ముప్పాళ్ళ ఎస్‌ఐ కిశోర్ బాబు అడ్డుకుని కార్యక్రమాన్ని నిలిపి వేయాలని కోరడంతో కన్నా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికీ తిరగడానికి పర్మిషన్ కావాలనడం ఇప్పుడే చూస్తున్నా.. మంత్రి ప్రచారానికి కూడా ఇలా పర్మిషన్ అడుగుతారా అని నిలదీశారు. కార్యక్రమం ఆపేది లేదని కావాలంటే అందరం స్టేషన్‌కు వస్తాం అరెస్టు చేసుకోవాలని అనడంతో ఎస్‌ఐ తప్పుకొన్నారు.