జీపీఎస్‌ ఆమోదయోగ్యం కాదు

ABN , First Publish Date - 2023-08-22T03:34:15+05:30 IST

అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎ్‌సను రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తానని ఎన్నికల ముందు జగన్‌ స్పష్టమైన హామీ ఇచ్చారని,

జీపీఎస్‌ ఆమోదయోగ్యం కాదు

సచివాలయ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం

అమరావతి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎ్‌సను రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తానని ఎన్నికల ముందు జగన్‌ స్పష్టమైన హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు జీపీఎ్‌సతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోట్ల రాజేష్‌, నాపా ప్రసాద్‌ అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత ఎన్జీవో రాష్ట్ర మహాసభలో సీఎం మాట్లాడుతూ.. జీపీఎస్‌ పేరుతో ఉద్యోగులకు సీపీఎస్‌ తీసుకొస్తున్నామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఉద్యోగుల అభిప్రాయాలను కూడా తీసుకోకుండా జీపీఎ్‌సపై ముందుకు వెళ్లడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఓపీఎస్‌ అమలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

పాత పెన్షన్‌ పునరుద్ధరించాల్సిందే: రామకృష్ణ

సీపీఎస్‌ ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. జీపీఎస్‌ ప్రతిపాదనను విరమించుకునేలా అన్ని సంఘాల నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.

Updated Date - 2023-08-22T03:34:15+05:30 IST