పెన్షనర్ల సమస్యల బాధ్యత ప్రభుత్వాలదే
ABN , First Publish Date - 2023-12-03T03:51:54+05:30 IST
సమాజంలో పెన్షనర్లు అంతర్భాగమని, వారి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మ ణ్యం అన్నారు.
ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఆవిర్భావ సదస్సులో
మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం
విజయవాడ (ధర్నాచౌక్), డిసెంబరు 2: సమాజంలో పెన్షనర్లు అంతర్భాగమని, వారి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మ ణ్యం అన్నారు. ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఆవిర్భావ సదస్సు విజయవాడలో శనివారం జరిగింది. ఎల్వీ మాట్లాడుతూ పెన్షనర్లు తమ హక్కులు, సమస్యల పరిష్కారానికి పార్టీని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నా రు. పెన్షనర్ల సమస్యల పరిష్కారంతో పాటు సమాజ హితానికి కృషి చేయాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ మాట్లాడుతూ పెన్షనర్లను ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. వారిని కేవ లం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నారు. ఎమ్మె ల్యే, ఎంపీలకు ఉన్న అన్ని రకాల సౌకర్యాలు పెన్షనర్లకు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ట్రంలో అన్ని అర్బన్ నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు.