ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు

ABN , First Publish Date - 2023-07-28T03:51:28+05:30 IST

ఆత్రేయపురం పేరు వినగానే గుర్తుకొచ్చేది నోరూరించే పూతరేకులు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పూతరేకులకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు

కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి సోంప్రకాశ్‌ వెల్లడి

ఆత్రేయపురం, జూలై 27: ఆత్రేయపురం పేరు వినగానే గుర్తుకొచ్చేది నోరూరించే పూతరేకులు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పూతరేకులకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ పూతరేకుల తయారీదారుల సహకార సంఘం విశాఖలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం సహకారంతో జీఐ ట్యాగ్‌ కోసం 2021 డిసెంబరు 13న దరఖాస్తు చేసింది. దీనిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ 14న జీఐ ట్యాగ్‌ సర్టిఫికెట్‌ నంబరు 483 మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో జియోలాజికల్‌ ఇండికేషన్‌ (జీఐ) సంస్థ పూతరేకులకు భౌగోళిక గుర్తింపు ఇచ్చిందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి సోంప్రకాష్‌ బుధవారం పార్లమెంటులో వెల్లడించారు. దీంతో ఈ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-07-28T03:51:28+05:30 IST