బీజేపీకి గద్దె బాబూరావు రాజీనామా
ABN , Publish Date - Dec 19 , 2023 | 03:02 AM
బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు పార్టీకి రాజీనామా చేశారు.
విజయనగరం దాసన్నపేట, డిసెంబరు 18: బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. వ్యక్తిగత సమస్యలతో పార్టీని వీడుతున్నానని, తన రాజకీయ ఎదుగుదలకు టీడీపీయే ప్రధాన కారణమని, టీడీపీతోనే ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. ౖ భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానన్నారు.