Share News

వైసీపీ నుంచి టీడీపీలోకి..

ABN , Publish Date - Dec 24 , 2023 | 12:12 AM

అల్లూరు గ్రామంలో నంద్యాల పార్లమెంటరీ టీడీపీ ఇన్‌చార్జి మాండ్రశివానందరెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో విసిగి పోయిన యువకులు టీడీపీలో చేరారు.

 వైసీపీ నుంచి  టీడీపీలోకి..

మాండ్ర సమక్షంలో పగిడ్యాల వైసీపీ నాయకుల చేరిక

కండువాలు కప్పి సాధరంగా స్వాగతం

మాండ్ర సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్న యువకులు

నందికొట్కూరు రూరల్‌ డిసెంబరు 23 : అల్లూరు గ్రామంలో నంద్యాల పార్లమెంటరీ టీడీపీ ఇన్‌చార్జి మాండ్రశివానందరెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో విసిగి పోయిన యువకులు టీడీపీలో చేరారు. శనివారం అల్లూరు గ్రామంలో మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో పగిడ్యాల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పగడం శేఖర్‌, పగడం మహేష్‌ ఆధ్వర్యంలో యువకులు టీడీపీలోకి చేరారు. మాండ్ర శివానందరెడ్డి వారిని పార్టీ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మాండ్ర నాయకత్వంపై తెలుగుదేశంపార్టీపై అభిమానంతో పార్టీలో చేరుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గుండెపోగు చినబాబు, కళ్యాన్‌, పవన్‌, సురేష్‌, సునీల్‌, స్వాములు, నాగేంద్ర, లక్ష్మన్న తదితరులు పార్టీలో చేరారు.

టీడీపీలో చేరిన పట్టణ మహిళలు : నందికొట్కూరు పట్టణంలో ఆర్‌ఎంపీ వైద్యులు మీనాక్షీదేవి, నాగశేషులు ఆధ్వర్యంలో మాండ్రశివానందరెడ్డి సమక్షంలో కొంత మంది మహిళలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇస్తున్న గౌరవం, అభివృద్ధి పథకాలను చూసి పార్టీలో చేరుతున్నామని అన్నారు. రూబియా, లక్ష్మి, సుమిత్ర, జ్యోతి, తదితరులు పార్టీలో చేరారు. మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో మహిళల అభివృద్ధికి ఎంతో తోడ్పాటును ఇస్తుందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఒక్కచంద్రబాబుకే సంపద సృస్టించగల శక్తి ఉందని స్పష్టం చేశారు.

Updated Date - Dec 24 , 2023 | 12:12 AM