జర్నలిజం నుంచి ఎమ్మెల్సీగా... భూమిరెడ్డి

ABN , First Publish Date - 2023-03-19T03:02:28+05:30 IST

వీరారెడ్డి, లక్ష్మీదేవమ్మ సంతానంగా 1969 మార్చి 23న జన్మించిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి బీఎస్సీ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు.

జర్నలిజం నుంచి ఎమ్మెల్సీగా... భూమిరెడ్డి

వీరారెడ్డి, లక్ష్మీదేవమ్మ సంతానంగా 1969 మార్చి 23న జన్మించిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి బీఎస్సీ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఆయన భార్య ఉమాదేవి. సింహాద్రిపురం మండలం కాంబల్లె సర్పంచిగా పనిచేశారు. భూమిరెడ్డి 1990-94 వరకు ఉదయం దినపత్రిలో పాత్రికేయునిగా పనిచేశారు. 1996లో టీడీపీలో చేరారు. పార్టీ జిల్లా కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. హోరాహోరీ పోరులో పశ్చిమ రాయలసీమ శాసన మండలి టీడీపీ అభ్యర్థిగా రామగోపాల్‌రెడ్డి గెలిచారు.

Updated Date - 2023-03-19T03:02:35+05:30 IST