మెడికల్ కాలేజీ ఎనఎంసీ తనిఖీకి ముందస్తు సౌకర్యాలు కల్పించాలి
ABN , Publish Date - Dec 30 , 2023 | 12:20 AM
మదనపల్లెలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిటీ తనిఖీకి ముం దస్తు వసతులు కల్పించాలని స్థానిక ప్రభుత్వాస్పత్రి మెడికల్ కాలేజీ ఇనచార్జి ప్రిన్సిపాల్ మురళీధర్ పేర్కొన్నారు.
మదనపల్లె టౌన, డిసెంబరు 29: మదనపల్లెలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిటీ తనిఖీకి ముం దస్తు వసతులు కల్పించాలని స్థానిక ప్రభుత్వాస్పత్రి మెడికల్ కాలేజీ ఇనచార్జి ప్రిన్సిపాల్ మురళీధర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో మెడికల్ కాలేజీ ఇనచార్జి ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్‌వీ మెడికల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్లు సమావేశమ య్యారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన భవనాలు, వసతులు, బోధన అధ్యాపకుల సంఖ్య తదితర విషయా లపై చర్చించారు. ఎనఎంసీ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశాకే ఎనఎంసీ తనిఖీకి వస్తారని మురళిధర్ తెలిపారు. దీనికి అవసరమై ఏర్పాట్లపై ఎస్‌వీ మెడికల్ కాలేజీ నుంచి వచ్చిన కమిటి సభ్యుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం లో ఎస్‌వీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు డాక్టర్లు ఏసీ కిరీటి, సి.శ్రీకాంతరెడ్డి, ఎన.మాధవిలత తదితరులు పాల్గొన్నారు.