రాష్ట్రంలో మరో ఐదు కరోనా కేసులు
ABN , Publish Date - Dec 28 , 2023 | 03:14 AM
రాష్ట్రంలో మరో ఐదు కరోనా కేసులు బయటపడ్డాయి. బుధవారం అనంతపురంలో ఇద్దరికి, కర్నూలులో ఇద్దరికి, ప్రకాశం జిల్లా లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
అనంతపురం, కర్నూలు, ఒంగోలు, డిసెంబరు 27: రాష్ట్రంలో మరో ఐదు కరోనా కేసులు బయటపడ్డాయి. బుధవారం అనంతపురంలో ఇద్దరికి, కర్నూలులో ఇద్దరికి, ప్రకాశం జిల్లా లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన వృద్ధురాలు (64), లక్ష్మీనగర్‌కు చెందిన వ్యక్తి (55) కరోనా లక్షణాలతో జిల్లా ఆస్పత్రిలో చేరారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. కొవిడ్ నిర్ధారణ అయినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 84 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గర్భిణీ కొవిడ్ పాజిటివ్ వచ్చింది.