Minister Buggana : బాధ్యతాయుత మద్యపానం!

ABN , First Publish Date - 2023-03-18T03:43:48+05:30 IST

మా ప్రభు త్వం మద్యంపై ఆధారపడిందని అంటున్నారు. కానీ మా ఆలోచన బాధ్యతాయుతమైన మద్యపానం(రెస్పాన్సిబిల్‌ డ్రింకింగ్‌). ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ.16,167 కోట్ల ఆదాయం వచ్చిం ది. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.18వేల కోట్లు

Minister Buggana : బాధ్యతాయుత మద్యపానం!

ఇదే మా ప్రభుత్వ విధానం.. ప్రతిపక్షం బాధ ఏమిటో?

బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి బుగ్గన సమర్థింపు

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): మా ప్రభు త్వం మద్యంపై ఆధారపడిందని అంటున్నారు. కానీ మా ఆలోచన బాధ్యతాయుతమైన మద్యపానం(రెస్పాన్సిబిల్‌ డ్రింకింగ్‌). ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ.16,167 కోట్ల ఆదాయం వచ్చిం ది. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.18వేల కోట్లు అని పెట్టాం. ఏడాదిలో రూ.16 వేల కోట్లు.. రూ.18వేల కోట్లు కాకూడదా? ప్రతిపక్షం బాధ ఏమిటో అర్థంకావట్లేదు అని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మద్యం ద్వారా 2023-24లో రూ.18వేల కోట్లు తీసుకోబోతున్నామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. పైగా తమ ప్రభు త్వం బాధ్యతాయుతమైన తాగుడుకు కట్టుబడి ఉం దని సమర్థించుకున్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సంపూర్ణ మద్యపాన నిషేధం హామీని గురించి మాత్రం తన ప్రసంగంలో రాకుండా జాగ్రత్తపడ్డారు. 2023-24 బడ్జెట్‌పై శుక్రవారం జరిగిన సాధారణ చర్చకు సమాధానం ఇచ్చారు. మద్యం ధరలు పెంచితే ఎందుకు పెంచారంటారు. తగ్గిస్తే ఎవరికోసం తగ్గించారంటారు అని అన్నారు. బడ్జెట్‌లో ఎక్కడా అంకె ల గారడీ లేదన్నారు. ఆదాయం పెరిగితే ప్రతిపక్షం బాధపడుతోందన్నారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా కింద 2022-23లో రూ.38,176 కోట్లు వచ్చాయని, 2023-24లో రూ.41,333 కోట్లు వస్తాయని పెట్టడంలో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. విభజన నాటికి రాష్ట్ర అప్పులు రూ.1,13,790 కోట్లు ఉంటే, 2019లో అధికారం మారే నాటికి అవి రూ.2,72,000 కోట్లకు చేరాయని, అంటే 19 శాతం పెరిగాయని వివరించారు. అదే తమ ప్రభుత్వంలో అప్పులు రూ.4,42,500 కోట్లకు చేరాయని, పెంపు కేవలం 13.5 శాతం మాత్రమేనని సమర్థించుకున్నారు. పక్క రాష్ర్టాల్లో ఆర్థిక లోటు ఇంకా ఎక్కువ పెరిగిందన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్త లో అసలు మీరు పరిపాలన చేయగలరా? అన్నారని, తర్వాత రెండో ఏడాది ఈ ఒక్క ఏడాది గట్టెక్కితే చాలన్నారని, అలా ఇప్పుడు నాలుగేళ్లు విజయవంతంగా పూర్తిచేశామని చెప్పారు. తాను ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అప్పుల కోసం వెళ్లానని ప్రచారం చేశారని ఆరోపించారు. ఢిల్లీలో అప్పులు తప్ప ఇంకేం పనులుండవా అని బుగ్గన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన పాపాలు కడగడానికి 30సార్లు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందన్నారు.

Updated Date - 2023-03-18T03:43:48+05:30 IST