Share News

బకాయిలు, పదోన్నతులపై పోరు

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:56 AM

ప్రభుత్వంలో విలీనం అయ్యారు. ఏదీ అడగడానికి వీల్లేదు’’ అనే ధోరణి అంగీకరించే ప్రసక్తేలేదని ఎన్‌ఎంయూ స్పష్టం చేసింది.

బకాయిలు, పదోన్నతులపై పోరు

ఎన్‌ఎంయూ నిరసన తీవ్రం

ఎనిమిదిన ప్రభుత్వానికి అర్జీలు

అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వంలో విలీనం అయ్యారు. ఏదీ అడగడానికి వీల్లేదు’’ అనే ధోరణి అంగీకరించే ప్రసక్తేలేదని ఎన్‌ఎంయూ స్పష్టం చేసింది. ఆర్టీసీ సిబ్బంది సమస్యలు, పెండింగ్‌ బకాయిలు, పదోన్నతులు తదితర డిమాండ్లపై కొన్ని రోజులుగా ఉద్యమిస్తున్న ఎన్‌ఎంయూ జనవరి 8న ఎమ్మార్వో కార్యాలయాల నుంచి కలెక్టరేట్ల వరకూ తమ డిమాండ్ల సాధన కోసం వినతిపత్రాలు అందజేయనున్నట్లు ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణా రెడ్డి తెలిపారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్‌ డిపోలలో ఆర్టీసీ సిబ్బంది సమస్యలు, సంస్థ ఇబ్బందులపై ముద్రించిన కరపత్రాలను పంచారు. విజయవాడలో రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య నేతృత్వంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానం మేరకు సుమారు 27 సమస్యలు ఎండీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. కాగా, ‘‘మా సమస్యల గురించి పలుమార్లు విన్నవిస్తున్నా స్పందన లేదు. నెలాఖరు లోపు సమస్యలు పరిష్కరించకుంటే జనవరి మొదటి వారంలో బస్సులు ఆపేస్తాం’’ అని ఆర్టీసీ యాజమాన్యానికి అద్దె బస్సుల యజమానులు గడువు విధించాయి.

Updated Date - Dec 28 , 2023 | 03:56 AM