రైతుల సభా?.. రాజకీయ సభా?

ABN , First Publish Date - 2023-06-02T04:36:00+05:30 IST

రైతు భరోసా సభ అంటే....వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లలో రైతులకు ఏం చేశారు, ఇంకా ఏం చేయబోతున్నారో సీఎం జగన్‌

రైతుల సభా?.. రాజకీయ సభా?

బాబుపై విమర్శలతో నిండిన సీఎం స్పీచ్‌

కర్నూలు, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా సభ అంటే....వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లలో రైతులకు ఏం చేశారు, ఇంకా ఏం చేయబోతున్నారో సీఎం జగన్‌ వివరిస్తారని రైతులు ఆశించారు. గంటా 20 నిమిషాలకు పైగా ప్రసంగం చేసిన జగన్‌.. టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించడానికే ఎక్కువ సమయం వినియోగించడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రైతుల గురించి కాకుండా రాజకీయాలు మాట్లాడుతుండటంతో జగన్‌ ప్రసంగం మధ్యలోనే రైతులు బయటకు వెళ్లిపోయారు. కాసేపటికి పొదుపు మహిళలు కూడా అక్కడినుంచి బయటపడ్డారు.

ఇదీ ఎయిర్‌పోర్టు కథ...

కర్నూలు (ఓర్వకల్లు) ఎయిర్‌పోర్టు చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే 90–95 శాతం పూర్తయింది. సీఎం హోదాలో చంద్రబాబు ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించారు. ఆయన హయాంలోనే విమానాలు రన్‌వేపై పరుగులు పెట్టాయి. ఇది వాస్తవం. పత్తికొండ సభలో జగన్‌ ఒక కథ చెప్పారు. ‘‘చంద్రబాబు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు టెంకాయ కొట్టి వదిలేశారు. ఈ ప్రాజెక్టును రూ.160కోట్లు ఖర్చుచేసి వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసింది’’ అంటూ పట్టపగలే ఆయన కట్టుకథలు వల్లించారు.

Updated Date - 2023-06-02T04:36:00+05:30 IST