నేడు రైతు భరోసా సొమ్ము విడుదల

ABN , First Publish Date - 2023-06-01T04:57:53+05:30 IST

‘వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ పథకం’ కింద ఈ ఏడాది తొలి విడత వాయిదా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేయనుంది. ఒక్కొక్కరికీ రూ.7,500

నేడు రైతు భరోసా సొమ్ము విడుదల

కర్నూలు జిల్లా పత్తికొండలో బటన్‌ నొక్కి నిధులు జమ చేయనున్న సీఎం జగన్‌

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): ‘వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ పథకం’ కింద ఈ ఏడాది తొలి విడత వాయిదా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేయనుంది. ఒక్కొక్కరికీ రూ.7,500 చొప్పున 52,30,939 మంది రైతుల ఖాతాల్లో రూ.3,923.21 కోట్లు జమచేయనుంది. కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి ఈ నిధులను జమ చేస్తారు. సీఎం బటన్‌ నొక్కగానే రైతుభరోసా సాయం కింద రూ.5,500 రైతుల ఖాతాల్లో జమ అవుతాయని, పీఎం కిసాన్‌ కింద రావాల్సిన రూ.2 వేలు కేంద్రం ఆ నిధులను విడుదల చేశాక రైతుల ఖాతాల్లో పడతాయని అధికారులు తెలిపారు. అలాగే గత మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో అకాల వర్షాలకు 30,382 హెక్టార్లలో పంట నష్టపోయిన 47,999 మంది రైతులకు రూ.44.19 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట కోత అనంతరం వర్షాలకు పంట నష్టపోయిన 3,469 మంది జొన్న, మొక్కజొన్న రైతులకు రూ.9.43 కోట్ల ప్రత్యేక పరిహారాన్ని కూడా చెల్లించనున్నట్లు చెప్పారు.

Updated Date - 2023-06-01T04:57:53+05:30 IST